Aug 05,2023 19:11

అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
టిడిపి కాన్వాయిపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టిడిపి సీనియర్‌ నాయకులు సూరం భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి, కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు కాన్వాయిపై రాళ్ల దాడి చేసి పలువురిని గాయాల పాలు చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, స్థితిగతులు తెలుసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసిపి నాయకుల్లో గుబులు పుట్టుకుందన్నారు. జమ్మలమడుగు, పులివెందులలో జరిగిన సభలకు ఇసుక రాలనంత జనం వచ్చారని తెలిపారు. పుంగనూరులో కూడా పర్యటన విజయవంతం కావడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుట్రకు పాల్పడడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పాలకులు దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నాయకులు ఫక్రుద్దీన్‌, రామచంద్రప్ప, సోమశేఖర్‌ రెడ్డి, షేక్షావలీ, కారుమంచప్ప, మల్లికార్జున, మల్లేశప్ప, రాముడు, రామకృష్ణ ఉన్నారు. హోళగుంద టిడిపి కార్యాలయంలో కన్వీనర్‌ డాక్టర్‌ తిప్పయ్య మాట్లాడారు.