రొద్దం : రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను తరిమికొడదామని తెలుగుదేశం నాయకులు అన్నారు. మండలంలోని క్లస్టర్ 1లో ఇదేమి ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమాన్నిఆదివారం పెద్ద గువ్వలపల్లి లో నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నప్పయ్య, నాగేంద్ర, రవి, వెంకటరముడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఓబులదేవరచెరువు మండలం తిప్పేపల్లి పంచాయతీ ఉంట్ల వారి పల్లి లో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ముసుగులో పేదలపై పన్నుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు చేసిందేమీ లేదని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా రాయితీ కింద వ్యవసాయ పరికరాలు అందజేయలేదని విమర్శించారు. దీనికి తోడు రైతుల నడ్డి విరిగేలా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులయితే సకాలంలో వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ అస్తవ్యస్తమైన పాలన చూసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, మండోజి ఆరిఫ్ ఖాన్, జాకీర్ అహ్మద్, అంజినప్ప , బడిసం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










