ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలో రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో 'మేము సైతం' అంటూ కోసిగి మండల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జీలు చేపట్టిన రీలే నిరాహార దీక్ష పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుపై ఎన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కోసిగి మండల క్లస్టర్ ఇన్‌ఛార్జీలు జ్ఞానేష్, భరద్వాజ్ శెట్టి, జంపాపురం కృష్ణారెడ్డి, ఐరన్‌గల్ శివ, రామచంద్ర నాయుడు, రవితేజ శెట్టి, చిన్నబూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, సాతునూరు ఉలిగయ్య, వెంకటేష్, కోసిగి శ్రీనివాస్, బెళగల్ గుండేష్, ఉసేని, దొడ్డయ్య, హనుమంతు రెడ్డి, హనుమంతు, మారేష్, నర్సారెడ్డి, రామాంజినేయులు దీక్షల్లో కూర్చున్నారు. తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, గోపాల్ రెడ్డి, పెద్దకడబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, కోసిగి టౌన్ అధ్యక్షులు పంపాపతి, కొండగేని వీరారెడ్డి, అశోక రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, వట్టెప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు, రామకృష్ణ, ఎంపిటిసి రాజు, నక్కే వెంకటేష్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మారెప్ప, ఏబు, వగరూరు అబ్దుల్, పవన్ కూమర్ రెడ్డి, గోపాల్, దస్తగిరి, కందుకూరు రామన్న గౌడ్, అయ్యన్న, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, ఐ టిడిపి సల్మాన్ రాజు, నీలకంఠ, లింగప్ప, హనుమంతు పాల్గొన్నారు.
దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి










