Sep 11,2023 22:11

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు రెక్టార్‌ ఎం.విజయకుమార్‌

         ప్రజాశక్తి-అనంతపురం    రాబోయే కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియెగం ప్రముఖ భూమిక పోషిస్తుందని జెఎన్‌టియు ఎం.విజయకుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సెమినార్‌ హాలులో ప్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో 'డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫ్‌ పవర్‌ కన్‌వర్ట్‌ ఆఫ్‌ ఎలాక్ట్రిక్స్‌ వెహికిల్స్‌' అనే అంశంపై ఐదురోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని రెక్టార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు కాలంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రన్నింగ్‌ ధర తక్కువగా ఉంటుందని, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అధ్యాపకులు ఇలాంటి ప్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకుని విద్యార్థులకు పంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి హైదరాబాద్‌ బి.రవికుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, ప్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ బి.ఈశ్వర్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్‌ జె.శ్రీనివాసులు, ఎం.అంకారావు, డైరెక్టర్లు పి.సుజాత, ఆర్‌.కిరణ్మయి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇ.అరుణకాంతి, ప్రోగ్రాం కన్వీనర్‌ ఎం.రామశేఖర్‌రెడ్డి, కళాశాల విభాగ అధిపతులు ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, కె.ఎఫ్‌.భారతి, కలికిరి ఇఇఇ విభాగం అధిపతి బి.జితేంద్రగౌడ్‌, శ్రీధర్‌, వి.శంకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.