Sep 21,2023 15:09

చంఢీగఢ్ :   గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ సన్నిహితుల కోసం పంజాబ్‌ పోలీసులు జల్లెడ పడుతున్నారు. గురువారం ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైందని, ప్రత్యేక పోలీస్‌ బృందాలతో పాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారని అన్నారు.  ప్రముఖ పంజాబ్‌ గాయకుడు సిద్ధు మూసావాలా హత్య కేసులో గోల్డీబ్రార్‌ ప్రధాన నిందితుడు. సిద్ధు మూసావాలాగా పిలుచుకునే సుదీప్‌ సింగ్‌ సిద్ధు గతేడాది మేలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన గోల్డీబ్రార్‌ 2017లో స్టూడెంట్‌ పాస్‌పోర్ట్‌తో కెనడాకు పారిపోయాడు. గోల్డీబ్రార్‌ లారెన్స్‌ బిష్ణోరు గ్యాంగ్‌లోనూ కీలక సభ్యుడిగా ఉన్నాడు.