ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : ఆదివారం నాడు బుట్టాయిగూడెం మండలంలోని వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది తహసిల్దార్ కార్యాలయంలో ఇంటి నెంబర్లు సున్నా ఉన్న వాటి వివరాలు సవరణలు, రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితాల వెరిఫికేషన్ విధులు నిర్వహిస్తూ ఉండగా పులిరామన్నగూడెం వీఆర్వో కోటం బాలరాజు అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోవడంతో తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వీఆర్వో ఆ విధంగా పడిపోవడాని చూసి తోటి సిబ్బంది ఆయన చనిపోయారేమోనని భయకు గురి అయ్యారు. గత కొద్ది రోజులుగా వీఆర్వో లు సచివాలయ సిబ్బంది పై పని భారం పనిఒత్తడు ఎక్కువైనట్టు కనిపిస్తుంది రెండవ శనివారం, కృష్ణాష్టమి, ఆదివారం వరుసగా సెలవులు రాగా వీఆర్వోలు చేత సచివాలయ సిబ్బంది చేత ఇటువంటి సెలవు రోజులలో కూడా పని చేయించడం వలన అనారోగ్య తో అస్వస్థతకు గురైన సంఘటనలు జరుగుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మండలం కావడంతో మారుమూల గ్రామాలలో సిగ్నల్ సమస్య ఉండడం వలన పనులు అనుకున్నంత సమయానికి జరగకపోవచ్చు పై ఉన్నతాధికారులు పని త్వరగా జరగాలని చెప్పడంతో సెలవు రోజులలో కూడా పనిచేయడం వలన త్వరగా పని అయిపోవాలి అని ఉన్నతాధికారుల ఒత్తిడి వలన అధికారులు అస్వస్థకు గురవుతున్నారని తెలుస్తుంది.










