ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం జగ్నాయుడు, సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు, వై రాజు, ఐద్వా నాయకులు బి ఈశ్వరమ్మ, కుమారి, బి పద్మ, రమణి తదితరులు పాల్గొన్నారు.










