ప్రజాశక్తి-మోపిదేవి : విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో చల్లపల్లిలో ధర్నా..మానవహారం నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీలం నారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వాకా రామచంద్రరావు, సిపిఎం మోపిదేవి మండల కార్యదర్శి బండి ఆదిశేషు, సిఐటియు చల్లపల్లి మండల కార్యదర్శి ఎండి కరీముల్లా, నాయకులు నంద్యాల ప్రభు, వెనిగళ్ళ వసంతరావు, కొమ్ము జయరావు, గొళ్ళ సాంబశివరావు ,బల్ల వెంకటేశ్వరరావు, రావుల దావీదు, కృష్ణాజిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ రేపల్లె పాయింట్ అధ్యక్షులు, మరియు ఆటో కార్మికులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.










