- ప్రజా కార్మిక లోక సమస్యల పరిష్కారం కోసమే ప్రజాశక్తి సప్తగిరి మళ్ళీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లికార్జున
ప్రజాశక్తి-ఉరవకొండ : సామాన్య ప్రజలతో పాటు కార్మికలోక సమస్యల పరిష్కారం కోసమే ప్రజాశక్తి పత్రిక నిరంతరం కృషి చేస్తుందని సప్తగిరి మళ్లీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,సేపక్ తక్ర సంఘం జిల్లా అధ్యక్షులు,ఉరవకొండ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మల్లికార్జున పేర్కొన్నారు. ఆదివారం ఉరవకొండలో లయన్స్ క్లబ్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజాశక్తి పత్రిక 43వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రిక సమాజంలో బడుగు,బలహీన వర్గాల వారు కార్మికులు,సామాన్య ప్రజలుతో పాటు కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్,ఉద్యోగులు,ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనాలు రాస్తూ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు చేరవేస్తూ మధ్య వారిదిగా ఉంటుందన్నారు.భవిష్యత్తులో కూడా ప్రజారంజక కథనాలు రాసి ప్రజలందరూ హృదయాలలో స్థిరంగా నిలిచిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబులేసు,ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాకే భాస్కర్,దళిత గిరిజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు గోపాల్,హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్,మాదిగ ఫెడరేషన్ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ,లయన్స్ క్లబ్ మాజీ రీజినల్ చైర్మన్ బాలచంద్ర,లయన్స్ క్లబ్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ గణేష్ బాబు, మాజీ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, లయన్స్ క్లబ్ సెక్రటరీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.










