Oct 05,2023 12:51

ప్రజాశక్తి-పత్తికొండ : పత్తికొండ పట్టణం జయం తాండ గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్న స్థావురాలపై దాడులు చేసి 1000 లీటర్లను బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు, 40 లీటర్ల సారాయిను స్వాధీనం చేసుకున్నట్లు పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు పత్తికొండ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండ తుగ్గలి  మద్దికేర జొన్నగిరి ఎస్సై లతో కలిసి జయంతాండాలోని కార్డెన్ సెర్చ్ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాటు సారా పై ప్రజలు అవగాహన కల్పించారు. యువత నాటు సారాయికి అలవాటు పడి బానిసలు అవుతున్నారని తెలిపారు. రికార్డు లేని ఏడు మోటర్ వెహికల్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పత్తికొండ అర్బన్ సిఐ మురళీమోహన్ పత్తికొండ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పత్తికొండ ఎస్సై గోపాల్, తుగ్గలి ఎస్సై మల్లికార్జున మద్దికేర ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ జొన్నగిరి ఎస్ఐ రామాంజనేయులు కానిస్టేబుల్  గోపాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.