- తొమ్మిది మందిని అరెస్ట్
- రూ.3 లక్షలకు పైగా నగదు
ప్రజాశక్తి-కాళ్ళ : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడు గ్రామంలో చేపల చెరువుపై గెస్ట్ హౌస్ లో పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి.3 లక్షలకు పైగా నగదు, తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ శనివారం తెలిపారు. క్యాసినో మాదిరి క్యాష్ కౌంటర్ లో ముందే చెల్లించి, కాయిన్స్ తో లక్షల్లో పేకాట బెట్టింగ్ లు అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో జరుగుతున్న పేకాట స్థావరం కావడంతో రాజకీయ ప్రముఖులు జారుకున్నారు. రూ.3 లక్షలకు పైగా నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక బైక్, కాయిన్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ వివరించారు.










