ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న అంగన్వాడి వర్కర్లు అండ్ హెల్పర్ల సమస్యలు పరిష్కారం కోసం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అంగన్వాడీలపై ఆదివారం నుండి నిర్బంధం మొదలైంది. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల కార్యదర్శి, జిల్లా నాయకురాలు కె వెంకటలక్ష్మిని పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. ఎటువంటి మీటింగులకు, ధర్నాలకు వెల్లరాదని, పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆంక్షలు విధించారు.










