ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : వినాయక చవితి పండుగ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. ఏలూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే వినాయక విగ్రహాల నిమజ్జనంలో భారీగా భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక విగ్రహాల నిమజ్జనాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయడానికి ముందస్తుగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆయా ప్రాంతాలను తనిఖీ చేశారు. అలాగే నిమజ్జనాల సమయంలో వాహనాలలో అధిక సంఖ్యలో భక్తులు వల్ల రాదని సూచించారు. బాణాసంచాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆమె సూచించారు. మున్సిపల్ సిబ్బంది క్రేన్ల సహాయంతో తమ్మిలేరులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఈ శ్రీనివాసులు ఒకటో పట్టణ సీఐ రాజశేఖర్ ఎస్ఐ సాదిక్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










