- చెన్నాపురం వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-ఎమ్మిగనూరు : ప్రణాళిక ద్వారానే విద్యార్థులకు భవిష్యత్తును అందించవచ్చునని ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ చెన్నాపురం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్ లో నవోదయ సైనిక్ గురుకుల్ మోడల్ స్కూల్ లకు ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును అన్నారు. హాస్టల్ వసతి కలదని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నిరంతర బోధన నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సంవత్సరంలోనే నవోదయ నందు ఒక సీటు సాధించడం జరిగిందని, సైనిక్ స్కూల్ నందు ఒక సీటు సాధించడం జరిగిందని, గురుకుల నందు 12 సీట్లు సాధించడం జరిగింది అన్నారు. మరిన్ని అనుభవాలతో మెరుగైన విద్యనందించి ఎక్కువ సీట్లు సాధిస్తామన్నారు.










