- అనంతనగరంలో దాహం దాహం
- మూడు రోజులుగా తాగునీటికి కటకట లాడుతున్న ప్రజలు
- పట్టించుకోని కార్పొరేషన్ అధికార యంత్రాంగం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరంలో తాగునీటికై ప్రజలు కటకటలాడిపోతున్నారు. ప్రజలు దాహంతో అల్లాడిపోతూ కనీస అవసరాలకు నీరు లభించక కటకట లాడుతుంటే పట్టించుకునే నాధుడు కరువయ్యారు చుక్క నీరు రాక కొళాయిలు సైతం మూగపోయాయి. కనీస అవసరాల కోసం వాడకం నీటికి కూడా కరువై జనం అల్లాడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ యంత్రాంగం గాని పబ్లిక్ హెల్త్ అధికారులు కానీ ప్రజలకు ప్రసార మాధ్యమాల ద్వారా కనీస సమాచారం కూడా అందజేయకపోవటం దారుణాతి దారుణం ప్రింట్ మీడియాకు సూపరిండెంట్ ఇంజనీర్ నాగమోహన్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు ప్రజలు దాహార్తితో దాహం దాహం అని కేకలు వేస్తున్న జనం గోడు వినే వారు కరువయ్యారు ఇది చాలదన్నట్లు ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా స్వచ్ఛత హి కార్యక్రమాలకు నియమించడంలో ఉన్నతాధికారిని దృష్టిలో ప్రజలకు ఉన్న విలువ ప్రజల పట్ల బాధ్యత ఏ పాటిదో చెప్పకనే చెప్పినట్లు అవుతుంది కనీసం వాటర్ వర్క్స్ అధికారులను స్వచ్ఛతాహి కార్యక్రమాలకు దూరంగా ఉంచకుండా చూడటంలో తగు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం కనీస అవసరాల నిమిత్తం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టాలన్న దిశగా చర్యలు చేపట్టకపోవటంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేతి బోర్లు కూడా అరుదుగా కనిపిస్తున్నట్టు వాటి వద్ద జనం గుంపులు కూడా రు. బోర్లు ఉన్న ఇలా వద్దకు వెళ్లి రెండు బిందువుల నీటి కోసం వారిని ప్రాధేయపడటం కనిపించింది అయితే విద్యుత్ బిల్లులకు జడిసిన ప్రజలు తమ అవసరాలకే ప్రాధాన్యమిస్తూ ఇతరుల విజ్ఞప్తులను సున్నితంగా నిరాకరించటం కనిపించింది జాగ్రత్తగా కాస్తో కూస్తో నీటిని నిల్వ చేసుకున్నవారు కూడా వరుసగా మూడో రోజు కూడా నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడటం కనిపించింది ఇలా మూడు రోజులుగా నగర ప్రజలు పడుతున్న బాధలు నీటికై పడుతున్న అవస్థలు వర్ణనాతీతం చీటికిమాటికి తనిఖీలకు వెళ్లే ప్రజాప్రతినిధులు సైతం ముద్దలాపురం ఫిల్టర్ ప్లాంట్ లో జరుగుతున్న ఇంటర్ కనెక్షన్ పనుల ప్రగతి ఎలా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించే తీరిక లేకపోవడం గమనార్హం ట్యాంకర్ల ద్వారా కనీస అవసరాలు నిమిత్తం నీటి సరఫరా చేసే పరిస్థితిలో లేకపోవడం అధికార యంత్రంగా నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ లో ఇంటర్ కనెక్షన్ పేరుతో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ సూపర్డెంట్ ఇంజనీరింగ్ నాగమోహన్ ఒక ప్రకటన ఇచ్చి చేతులు తెలుపుతున్నారు. శని ఆదివారాలు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని ప్రకటించిన కార్పొరేషన్ అధికారులు మూడో రోజు అయిన సోమవారం ఉదయానికి గాని ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తి చేయలేకపోయారు దీనితో సోమవారం ఉదయం తాగునీటి సరఫరా కావలసిన ప్రాంతాలకు నీటి సరఫరా జరగలేదు మూడో రోజు కూడా నీటి సరఫరా జరగకపోవడం ప్రజలలో ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే దిశగా కనీస ఆలోచన చేయకపోవడం ఇంజనీరింగ్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనగా నిలుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ పాలనాధికారి అయిన కమిషనర్ భాగ్యలక్ష్మి సైతం ఇతర అంశాలలో చూపించిన చొరవను నగర ప్రజల దాహార్తి తీర్చడానికి చూపకపోవడం దారుణాతి దారుణం తనయుడు పర్యటన ఏర్పాట్లకై చూపిన శ్రద్ధలో కాసింతైనా ప్రజా సమస్యలపై చూపితే బాగుండేదన్న చర్చ నడుస్తోంది. అలాగే ఈ పర్యటనకు అవసరమైన నిధుల వసూళ్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు శూన్యం తేలు కుట్టిన దొంగల్లా గప్ చీప్ గా ఉండిపోయారు ప్రతి అంశం లోను ఒకటికి 100 సార్లు ఆలోచించి అత్యంత నిశితంగా ఫైళ్లను సైతం పరిశీలించి నెలల తరబడి పెండింగ్ పెట్టుకొనే కమిషనర్ కు నగర ప్రజల దాహార్తి కనిపించకపోవడం లో ఆశ్చర్యమేమీ లేదని అధికార కాంట్రాక్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి దీనికి తోడు మినరల్ వాటర్ పేరుతో నీటి సరఫరా చేసే ప్లాంట్లు కూడా తక్కువ స్థాయిలో పనిచేయటం కనిపించిందని ప్రజలు పేర్కొంటున్నారు మున్సిపల్ వాటర్ ఆధారంగానే పలు మినరల్ ప్లాంట్లు నడుస్తున్నాయని ఆ అక్రమ కనెక్షన్లను అక్రమ నీటి చౌర్యాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిరోధించలేకపోతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు దీనితో అటు తాగునీటికి ఇటు వాడకం నీరు లభించక ప్రజలు మూడు రోజులపాటు నానా పాట్లు పడుతున్నారు అయితే ప్రజల పాట్లు అధికారులకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు దీనితో ప్రజల గోడు అరణ్య రోదనగా మారుతుంది వరుస సెలవులు రావడంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బోసిపోయింది తమ గోడు ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాక ప్రజలు సతమతమయ్యారు లీకేజీల పేరుతో ఇటీవల పలు ప్రాంతాలకు నీటి సరఫరా లో అడ్డంకులు ఏర్పడ్డాయి ఇంటర్ కనెక్షన్ పేరుతో నగరానికి రెండు రోజులపాటు నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్న విధంగా కాకుండా సోమవారం నాటికి ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తయ్యాయి దీంతో సోమవారం కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజల ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి ప్రత్యామ్నాయంగా నీటి సరఫరాను ట్యాంకర్ల ద్వారా కూడా చేపట్టకపోవడంపై అధికారులను ప్రశ్నించగా తప్పును అంగీకరిస్తూనే సమాధానం దాటవేసేందుకు యత్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛతాహి కార్యక్రమంలో ఉన్న శ్రద్ధ నగర ప్రజల తాగునీటి అవసరాలను ఇబ్బందులను గుర్తించి తగు చర్యలు చేపట్టే దిశగా ఆలోచించే సమయము లేకపోవడం బాధ్యతారాహిత్యం కాక మరేమోతుందో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలకు చెప్పాల్సి ఉంది అయితే ప్రజల సమస్యలు ఏవి తమవి కావునట్టు సాంకేతిక పరమైన అంశాలే నెరవేర్చటం తమ బాధ్యతగా అధికారులు భావించటం శోచనీయం










