Aug 07,2023 21:01

స్పందనలో అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ఫిర్యాదులు సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    జగనన్నకు చెబుదాం స్పందన ఫిర్యాదులను ప్రజలు సంతృప్తి చెందేస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్‌, డిఆర్వో పుల్లయ్య తదితర జిల్లాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులు రీ ఓపెన్‌ కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు అసంతృప్తి చెందిన కేసులు, రీఓపెన్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులు పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రారంభించని పనులు గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో 218 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కార్యమ్రకంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు.