ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాలు జారీ చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు చట్టపరిధిలో పరిష్కరించ డానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.










