Oct 05,2021 16:24

సోమవారం రాత్రి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ వంటి మెసేజింగ్‌ సర్వీసులకు, సామాజిక మాధ్యమాలకు అంతరాయం కలిగింది. దీనికి కారణం 'ఫాల్టీ కన్షిగరేషన్‌ ఛేంజ్‌' అని ఫేస్‌బుక్‌ ఇంక్‌ ప్రకటించింది. కన్ఫిగరేషన్‌లో మార్పు వల్ల సోమవారం దాదాపు ఆరు గంటలపాటు సుమారు 3.5 బిలియన్ల మంది యూజర్లు ఈ సేవలను వినియోగించుకోలేకపోయారు. ఫేస్‌బుక్‌ ఇంక్‌ సోమవారం రాత్రి ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో ఈ ఆరోపణ చేసింది. అయితే ఈ మార్పు ఎవరు చేశారు? ఇది ముందుగా ప్రణాళిక ప్రకారం అమలు చేసినదా? అనే విషయాలను తెలియజేయలేదు. ఇదిలావుండగా, ఓ వార్తా సంస్థతో కొందరు ఫేస్‌బుక్‌ ఉద్యోగులు మాట్లాడుతూ, ఈ అంతరాయానికి కారణం ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను సిస్టమ్స్‌కు బదిలీ చేయడంలో జరిగిన ఇంటర్నల్‌ మిస్టేక్‌ అని చెప్పారు. ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ టూల్స్‌ వైఫల్యం, అదే నెట్‌వర్క్‌పై ఆధారపడిన ఇతర వనరుల వైఫల్యం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు తెలిపారు. సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, ఈ కంపెనీలోని వ్యక్తుల వల్ల అనుకోకుండా పొరపాటు జరిగి ఉండవచ్చు, లేదా ఉద్దేశపూర్వక ద్రోహం జరిగి ఉండవచ్చు. ఫేస్‌బుక్‌ లాభార్జనకే ప్రాధాన్యమిస్తోందని, విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారాలను అరికట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ విజిల్‌ బ్లోయర్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.