ప్రజాశక్తి-పొదిలి : పొదిలి పిడిసిసి బ్యాంక్ ను చైర్మన్ ప్రసాద్ రెడ్డి సందర్శించారు. చైర్మన్ అయిన తరువాత మొట్ట మొదటి సరిగా పిడిసిసి బ్యాంక్ ను సందర్శించారు. రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకొని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పరిష్కరించమని ఆయన తెలిపారు. త్వరలో జిల్లాలో ఆరు నూతన బ్రాంచ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశంజిల్లా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్స్, సిఇఓలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










