పవన్ సిఎం కావటం ఖాయం
జనసేన పార్టీ కోడూరు మండల అధ్యక్షులు మర్రే గంగయ్య
ప్రజాశక్తి-కోడూరు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందటం ద్వారా తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సిఎం కావటం ఖాయమని జనసేన పార్టీ కోడూరు మండల అధ్యక్షులు మర్రే గంగయ్య చెప్పారు. గురువారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నంలో జరిగిన పదో ఆవిర్భావ సభను విజయవంతం చేసిన కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిజేశామన్నారు. కోడూరు మండలం నుండి పెద్ద ఎత్తున మచిలీపట్నం తరలి వెళ్లారని వివరించారు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు అవనిగడ్డ మీదుగా మచిలీపట్నం వెళ్లారన్నారు. మరి కొందరు ఉల్లిపాలెం-చిన్నాపురం మీదుగా మచిలీపట్నం చేరుకున్నారని వివరించారు. ఇదే ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడాలని కోరారు.










