Oct 17,2023 23:25

పొలంలో పూసా హైడ్రోజన్‌ చల్లుతున్నరైతు

ప్రజాశక్తి-కొండపి : బెట్ట పరిస్థితులను తట్టుకొనేందుకు మొక్కను అవసరమైన తేమను, పోషకాలను పూసా హైడ్రోజన్‌ అందజేస్తుందని జిల్లా వనరుల కేంద్రం ఎఒ ఎ.శైలజరాణి తెలిపారు. మండల పరిధిలోని అనకర్లపూడి రైతు భరోసా కేంద్రం పరిధిలోని వేముల శ్రీరాములు పొలంలో మంగళవారం మిర్చి సాగు చేశారు. ఈ సందర్భంగా డిఆర్‌సి, ఆత్యా ఫార్మర్‌ ఓరియెంటెడ్‌ పథకం 2023-24 లో భాగంగా పూసా హైడ్రోజన్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. రైతు పొలంలో ప్రయోగం చేశారు. ఈ సందర్భంగా శైలజారాణి మాట్లాడుతూ పూసా హైడ్రోజన్‌ పశువుల ఎరువుతో కలిపి పొలంలో వేయడం వల్ల వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని తర్వాత మొక్కకు అవసరాన్ని బట్టి నీరు అందిస్తుందని తెలిపారు. వర్షాభావ పరిస్థి తులలో ఇది బాగా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఎఒ వీరగంథం వెంటక శేషమ్మ, విఎఎ భరత్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.