old students
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ప్రజాశక్తి-గన్నవరం( వీరవల్లి)
బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూలులో ఆదివారం 50 వసంతాల పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ ఆదివారం పాఠశాలలో జరిగింది. పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరూ రావటం జరిగింది. ఆనాటి అను భవాలను, జ్ఞాపికలను నెమరవేసుకున్నారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థు ల సమ్మేళనం ఏర్పాటు చేయటం అభినందనీయమని ప్రముఖ వ్యాఖ్యాత కేయస్. జగదీశ్వరరావు అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకునే రోజుల్లో తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.










