Sep 03,2023 19:46

మృతి చెందిన పాపినాయుడు

బలిజిపేట: వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన యాలకుల పాపినాయుడు (45) పురుగుమందు తాగి మృతి చెందినట్లు బలిజిపేట ఎస్సై ఎన్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పాపినాయుడు గత కొన్నేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడని, తరచూ ఈ వస్తుందని మనస్థాపన చెంది తండ్రికి నారాయణపురం వెళ్లి మూర్ఛ నివారణకు మందులు కొనుక్కుంటానని చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో సువర్ణముఖి నది వద్ద గడ్డి మందు తాగి మరణిస్తున్నట్లు తన తమ్ముడికి తెలిపాడు. వెంటనే విషయం తెలుసుకున్న అతని తమ్ముడు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని రాజాం హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.