ముఖ్యమంత్రితో సెల్ఫీ తీసుకుంటున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ కోరారు. బుధవారం అనంతపురం జిల్లా నార్పలలో జరిగే బహిరంగ సభకు హాజరు కావడానికి వస్తున్న ముఖ్యమంత్రిని పుట్టపర్తి విమానాశ్రయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని వినతిపత్రాన్ని ఈసందర్భంగా సిఎంకు అందజేశారు.










