Aug 05,2023 22:52

ప్రజాశక్తి-గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుపై జరిగిన రాళ్ళ దాడికి నిరసనగా స్థానిక నెహ్రుచౌక్‌ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు అధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ, రూరల్‌ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళీలు మాట్లాడుతూ జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు పర్యటననే అడ్డుకుని దాడి చేశారంటే, ఈ రాష్ట్రంలో సామాన్యులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత నియోజవర్గ అధ్యక్షులు గోవాడ శివా, టిడిపి నాయకలు పొట్లూరి కృష్ణారావు, షేక్‌ జానీషరీఫ్‌, మజ్జాడ నాగరాజు, ఐనంపూడి సురేష్‌, రామదేణు వేణు, షేక్‌ సర్కార్‌, తదితరులు పాల్గొన్నారు