ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి ఇన్‌ఛార్జీ వై.జయ మనోజ్ రెడ్డి తెలిపారు. మంగళశారం పట్టణంలోని 10వ వార్డులో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. వార్డు ఇన్‌ఛార్జీ ఇక్బాల్‌తో కలిసి ఇంటింటి తిరుగుతూ వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేదలకు మంచి చేయాలంటే ప్రతిపక్షాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రోడ్లు, డ్రెయినేజీ సదుపాయం కల్పిస్తూ మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, సన్నీ, కౌన్సిలర్ సురేష్, రహీం, మధు, దుర్గప్ప, మల్లేకర్ గోవిందు, ధనుష్, సునాక్, అరుణ్, సందీప్, రీతు సింగ్, భద్ర, అమిత్, విద్యుత్ ఉద్యోగి హనుమంతు, చిరు నాయక్, నాగభూషణ్ గౌడ్, ఉస్మాన్ ఉన్నారు.
పథకాల గురించి వివరిస్తున్న నాయకులు










