Oct 30,2023 20:46

భూమి పూజ చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆరో వార్డులో రూ.20 లక్షలతో సిసి రోడ్డు, డ్రెయినేజీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలో తాగునీటి పైపులైన్లు, సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రఘు, వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.