భూమి పూజ నిర్వహిస్తున్న జగన్మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో 16వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, 23వ వార్డులో రూ.9.5 లక్షలతో డ్రెయినేజీ, 24వ వార్డులో రూ.10.5 లక్షలతో సిసి రోడ్డు పనులకు వార్డు కౌన్సిలర్లతో కలిసి భూమిపూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఛైర్మన్ డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.










