పట్టాలు సరే స్థలాలు ఎక్కడ..? - సిపిఐ
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులకు ఇక్కట్లు
ప్రజాశక్తి కొత్తపల్లి
గ్రామాల్లో ఉన్న పేదలకు పట్టాలు ఇచ్చారు సరే స్థలాలు ఎక్కడ అని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే రాధాకృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ సుబ్బరాయుడు జిల్లా నాయకులు ప్రతాప్ లు తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో కొత్తపల్లి గ్రామంలో నిరుపేదలకు దళితులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వర్గాల వారికి, 300 మందికి ఒక్కొక్క లబ్ధిదారునికి 3 సెంట్ల ప్రకారం స్థలాలు ఇవ్వడం జరిగింది. అయితే పట్టాలు పంపిణీ చేశారు కానీ వారికి స్థలం చూపించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారు అని తెలిపారు. ఆ స్థలం నేటికీ అట్లానే ఉంది కానీ లబ్ధిదారులకి పంపిణీ చేయలేదు సంబంధిత అధికారులు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనేకమార్లు అధికార పార్టీ నాయకులు మేము న్యాయం చేస్తామని వారి నుండి పట్టాలు జిరాక్స్లు చేయించుకుని వారితో ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టారు తప్ప వారికి న్యాయం చేయలేదు అన్నారు. న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని వారికి స్థలాలు చూపించకపోతే ఎర్రజెండాలు నాటి ప్రజలకు పంపిణీ చేస్తామని వారు హెచ్చరించారు. స్థానిక శాసనసభ్యుడు మాత్రం వాళ్ల ఓట్లతో అధికారం చేపట్టి వారికి స్థలం చూపించడంలో నిర్లక్ష్యం వహించారని వారు విమర్శించారు. లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే, సిపిఐ ఆధ్వర్యంలో ఆమర నిరాహార దీక్ష చేపట్టి లబ్ధిదారులకి న్యాయం చేసేందుకు ఎర్రజెండా ముందుంటుందని వారు హెచ్చరించారు. లబ్ధిదారులు జిరాక్స్ పట్టాలని స్పందనలో తాసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వెంకట శివుడు నాయకులు చంద్రశేఖర్ ,సురేష్, భీమలింగం, ముత్తు, మాణిక్యమ్మ, ముర్తుజాభి, రాణమ్మ, నాగమణి, జమ్ములమ్మ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.










