ప్రజాశక్తి-హలహార్వి : హలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలోవున్న MPP స్కూల్ లో 252 విద్యార్థులు ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు ఒకరే (1)ఉన్నారు. కాబట్టి అంతమంది పిల్లలకు ఒక్కరే చదువు చెప్పలేరు. పిల్లలకు చదువు చెప్పేవారు ఉంటే కదా చదువుకునేది. కావున మన స్కూల్ కి 5 ఉపాధ్యాయులు కావాలి కానీ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు వారు వారి పని చేసేకి ఎక్కువ ఉంటుంది. అందుకనే ఐదు తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా అలాగే కర్నూల్ కలెక్టరేట్ స్పందనకు మా స్కూల్లో ఉపాధ్యాయులు లేరని వినతిపత్రం ఇచ్చి 20 రోజులు అయింది. కానీ ఎటువంటి మార్పు రాలేదు. అక్కడ స్కూల్స్ లో స్టూడెంట్స్ సంఖ్య అధికంగా ఉంది. అయితే స్టూడెంట్స్ కు తగిన సంఖ్యలో చదువు చెప్పే ఉపాధ్యాయులు మాత్రం లేరు.. దీంతో స్టూడెంట్స్ తల్లిదండ్రులు టీచింగ్ స్టాఫ్ కొరతను నిరసిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్స్ కు తాళం వేశారు. అంతేకాదు.. ఉపాధ్యాయులను నియమించే వరకూ స్కూల్స్ వేసిన తాళాలు తీసేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 252 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇక్కడ స్కూల్ లో చదువు చెప్పేందుకు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళం వేశారు. ఓ వైపు స్టూడెంట్స్ లేక చాలా పాఠశాలలు క్లోజ్ అవుతుంటే.. తమ గ్రామంలో స్టూడెంట్స్ ఉన్నా.. టీచర్స్ లేక మూతబడుతున్నదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు తమ గ్రామంలోని స్కూల్ కు తక్షణమే టీచర్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ వేసిన తాళం తీయమని స్పష్టం చేశారు.










