పర్యావరణాన్ని కాపాడాలి
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు
ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని యాంటీ పొచింగ్ రేంజర్ పి.సుభాష్ తెలిపారు. మిషన్ లైఫ్ స్టైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సుండిపెంట, శ్రీశైలం, లింగాల గట్టులో పర్యావరణ పరిరక్షణపై ఫారెస్ట్ రేంజ్ అధికారి నరసింహులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లింగాలు గట్టు, యాత్రికుల పుష్కర ఘాటు, వాల్మీకుల కాలనీలోని ప్రాథమిక పాఠశాల, లింగాలగట్టు ఫారెస్ట్ చెక్‌పోస్ట్, వ్యూపాయింట్‌లో స్థానికులకు, యాత్రికులకు ఎఫ్‌ఎస్‌ఒ మదనమోహన్ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, వాటర్ బాటిళ్లు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వేయరాదని, ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ ఓబులేసు, సుండిపెంట బీటు ఆఫీసర్ పి.సలావుల్లా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్ భీంనాయక్, పి.శ్రీరాములు, ప్రొటెక్షన్ వాచర్స్, లింగాల గట్టు కాలనీవాసులు చెన్నయ్య, రాతం శీను, సుబ్బరాయుడు, అనిల్, నాగలింగం, నల్లబోతుల శ్రీను పాల్గొన్నారు .










