Aug 19,2023 19:54

మొక్కలు నాటుతున్న ప్రిన్సిపల్‌ మురళీమోహన్‌

ప్రజాశక్తి - ఆదోని
మానవ, జీవరాశుల మనుగడ కోసం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాడుపడాలని ప్రిన్సిపల్‌ మురళీ మోహన్‌ తెలిపారు. శనివారం ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆవరణలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి వర్షాకాలం కళాశాలలో మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది చింత, వేప, అశోక, చీమ చింత, మర్రి నీడనిచ్చే సుమారు వంద మొక్కలను నాటినట్లు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపల్‌ సురేష్‌, అధ్యాపకులు రమేష్‌, వేణు గోపాల్‌, రామకృష్ణ, మోహన్‌ రెడ్డి, విజరు, ఎన్‌ఎస్‌ఎస్‌ డివిజన్‌ అధికారి జోనాథన్‌, వాలంటీర్లు పాల్గొన్నారు.