పుట్టపర్తి అర్బన్ : జిల్లా పర్యటక రంగాన్ని బలోపితం చేసి, మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు పర్యటక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా టూరిజం అభివద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటక రంగం అభివద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పర్యటకులు విశేషంగా రావడానికి కార్యచరణ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. లేపాక్షి దగ్గర జటాయువు థీమ్ పార్క్ పచ్చదనంతో నింపాలని అధికారుల ఆదేశించారు. వీటితో పాటు వివిధ పర్యటక ప్రాంతాల్లో అతిథి గహాలు అసంపూర్తిగా ఉన్న భవనాలను నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో జరిగే సమావేశాలకు ఆర్డీవోలు, పరిశ్రమల శాఖ జీఎం, కియా కంపెనీ ప్రతినిధులు సమావేశానికి హాజరై విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా టూరిజం అధికారిని నాగేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. ఎన్‌పి కుంట మండలంలోని తిమ్మమ్మమర్రిమాను, చిలమత్తూర్ మండలంలోని వీరాపురం, రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయం ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, రీజనల్ టూరిజం డైరెక్టర్ రామచంద్ర, జిల్లా పర్యటకశాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ చంద్రమౌళిరెడ్డి, మెంబర్లు గంగాధర్, మల్లికార్జున, పద్మనాభం, జ్యోతి కేశవ, డిఒ మీనాక్షి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి, సంబంధిత శాఖఅధికారులు పాల్గొన్నారు.










