కదిరి టౌన్ : నీట్, ఐఐటిలో రాంకులు సాధించిన విద్యార్థులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక వేమారెడ్డి కూడలి లోని ఎన్జీవో హోంలో యుటిఎఫ్ కదిరి జోన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నీట్, ఐఐటీలో ప్రతిభ కనబరిచిన యుటిఎఫ్‌లోని సీనియర్ కార్యకర్తల పిల్లలకు ఆణిముత్యాలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి .సుబ్బారెడ్డి, వింధ్యరాణి కుమార్తె వై. అశ్రిత, డి . శ్రీనివాసులు, వీణ కుమారి కుమారుడు డి .చరితేష్ , ఇర్ఫాన్‌బాషా, పాహిమున్ కుమార్తె ఫసిహ బుష్రా , రవివర్ధన్ రెడ్డి హేమలత కుమార్తె సాహితీ, ఎం సుధాకర్, నిర్మల కుమారుడు ఎండి. కులదీప్‌ఈశ్వర్, లక్ష్మీ ప్రసాద్ , రాజ్యలక్ష్మి కుమార్తె యోజిత లకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. . ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, మున్సిపల్ హైస్కూల్ వీవర్స్ కాలనీ ప్రధానోపాధ్యాయులు నాగరాజు, యుటిఎఫ్ సీనియర్ నాయకుడు మైనుద్దీన్, హనీఫ్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు జంషీద్, యుటిఎఫ్ కదిరి ప్రాంత కుటుంబ సభ్యులు మల్లికార్జున, రమణ నాయక్, ఆజం భాష, ఖాజా మొయినుద్దీన్ , సునీల్, మనోహర్, సురేష్, షబానా, భార్గవ, జబివుల్లావివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ె










