సమావేశంలో మాట్లాడుతున్న సత్యసాయి ట్రస్టీ రత్నాకర్
రొద్దం. పర్తి సాయి సేవ సదన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెనుగొండ పావగడ ప్రధాన రహదారిలో పెన్నా నది సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పత్తి సాయి సేవా సమితి సదన్ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యసాయి ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈ సేవ కేంద్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని అభినందించారు. దేశవ్యాప్తంగా 13లక్షల మంది నిస్వార్థంగా సేవచేస్తున్నారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి, కెటి శ్రీధర్, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ దేశాలకు చెందిన వారు దాదాపు 400మందికి నిత్యావరస సరుకులు అందించారు.










