Jun 24,2023 18:08

గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి

ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - సంజామల

     వైసిపి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందించామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని నొస్సం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. అనంతరం ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా నొస్సం గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల హామీలు 99 శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డ్కికే దక్కుతుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, నాయకులు శివరామిరెడ్డి, వైసిపి మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.