ప్రతి కుటుంబ సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం
జనాభా నియంత్రణ అందరి ముఖ్య కర్తవ్యం
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి డా. ఆర్ వెంకట రమణ
ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
దేశ ప్రగతి అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక స్వాలంభణ లక్ష్యాల సాధన మనందరి బాధ్యతని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి డా. ఆర్ వెంకట రమణ అన్నారు.కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం దేశ జనాభాను అరికట్టడం మన సంకల్పమని ఆయన ఉపోద్ఘాటించారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవ కార్యాక్రమాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్ వెంకటరమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని జిల్లా పోగ్రాం ఆఫీసర్లు ఏ ఎన్ ఏం లు, ఆశా కార్యకర్తలతో, నర్సింగ్ విద్యార్థునులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి డా. వైస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు . డా.వైస్సార్ విగ్రహం నందు మానవహారంగా ఏర్పడి అందరిచే ప్రతిష్ట చేయించారు.ఈ సందర్భముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరిగిపోతున్నదని తద్వారా తలెత్తి దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలపై ప్రజలలో చైతన్యం కల్పించేందుకు ఐక్య రాజ్య సమితి 1987 వ సంవత్సరం జూలై 11 వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవముగా జరుపుకోవాలని ప్రకటించిందన్నారు. 141 కోట్ల జనాభాతో ప్రపంచంలో చైనా దేశము మొదటి స్థానంలోను, 134 కోట్ల జనాభాతో భారతదేశము రెండవ స్థానంలోను, 31 కోట్ల జనాభాతో అమెరికా మూడవ స్థానంలో ఉన్నాయన్నారు. 2027 సంవత్సరానికి భారత దేశము చైనా దేశ జనాభాను అధికమించే ప్రమాదము ఉన్నదని ఐక్యరాజ్యసమితి తెలిపినట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరము (2023) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ "స్వారంధ్య అమ్మద మహోత్సవం సందర్భంగా కుటుంబ సంతోషం శ్రేయస్సు కోసం ''''కుటుంబ నియంత్రణ పద్దతులను పాటిద్దాం అని ప్రతిజ్ఞ చేద్దాం"" అనే నినాదంతో చిన్న కుటుంబం యొక్క ఆవశ్యకతను తెలిపారు.కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు శాశ్వత పద్ధతులపై అర్హులైన దంపతులకు (ఈసీ ) అవగాహన కార్యక్రమములు నిర్వహించినట్లు తెలిపారు.వివాహ వయస్సుపైన, కుటుంబ నియంత్రణ పద్దతులపైన, బిడ్డబిడ్డకు ఏడు పైన, అవగాహన కల్పించి తల్లిబిడ్డ సురక్షితంగా ఉండేలా మాతృ మరణాలు, శిశుమరణాలు జరగ కుండా చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన ఓడల్ ఫిల్స్ (మాలా-న్ని నోటి మాత్రలు, ఛాయ నేటి మాత్రలు,ఈ.జి.పిల్, అంతర ఇంజెక్షన్లు విరోధి, పి.పి.ఐ.యు.సి.డి- కాకప్ టి లాంటి పద్ధతులపై అర్హులైన దంపతులకు క్షేత్ర స్థాయిలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది. ఏం హెచ్ పిలు, ఏ ఎన్ ఏం, ఆశా అంగన్ వాడి కార్యకర్తలకు అవగాహన కల్పించి పై పద్దతులను వాడేలా ప్రోత్సహించడం ఈ సంవత్సరం ప్రపంచ జనాభా మానోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ప్రతి కుటుంబ సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయమని,జనాభా నియంత్రణ అందరి ముఖ్య కర్తవ్యమని డి ఏం హెచ్ ఓ తెలిపారు.ఈ కార్యక్రమములో పాల్గొన్నవారు. డి ఐ ఓ డా.మల్లికార్జునరెడ్డి, రబీఎస్ కె డీసీ డా.కాంతారావు ఎఫ్ పి సి వోడల్ ఆఫీసర్ డా.జగదీష్ చంద్రా రెడ్డి పరిపాలని అధికారి డా. బెంద్రశేఖర్ ప్రసన్నలక్ష్మి డీపీఎం డా ప్రేమంత్. డమో కనకరాజు,50 పి.సుజాత,డెమో కె .రవీంద్ర నాయక్. హెల్త్ ఎడ్యుకేటర్ కె.మద్దిలేటి ఏం ఏల్ పి హెచ్ ఏ ఎన్ ఏం లు ఆశా కార్యకర్తలు నర్సింగ్ కాలేజీల విద్యార్థులు ఇతర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...










