Aug 22,2023 19:49

మాట్లాడుతున్న ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఉప్పర కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి జెసిఎస్‌ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ బిఆర్‌.బసిరెడ్డి మాట్లాడారు. సచివాలయ కన్వనర్లకు రూ.2 లక్షలు, గృహ సారథులకు రూ.లక్ష చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించాలని చెప్పారు. వారికి లబ్ధి చేకూరే విధంగా చూడాలని తెలిపారు.