లబ్ధి పత్రాలను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రతి గడపలోనూ నవరత్నాల వెలుగులు నిండుతున్నాయని వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని టిఎస్.కుల్లూరు గ్రామంలో రెండోరోజూ 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు, వ్యవసాయ సామగ్రి అందిస్తున్నారని వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.










