Sep 14,2023 21:05

ఆదోనిలో మాట్లాడుతున్న మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం ముందు చేపట్టిన దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి.
సిపిఐ సంఘీభావం
టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సిపిఐ నాయకులు మద్దతు పలికారు. రిలే దీక్షల్లో ఆదోని నాయీ బాహ్మణులు కూర్చున్నారు. సిపిఐ నాయకులు లక్ష్మి రెడ్డి, అజరు బాబు, వెంకన్న, గోపాల్‌, వీరేష్‌, రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యులు రంగస్వామి, ఆదోని నాయీ బాహ్మణ సాధికారిక సభ్యులు శ్రీనివాస గౌడ్‌, పసుపుల సూరి, మెకానిక్‌ ఈరన్న, మునిస్వామి, కోట వీరస్వామి, రవి, టిఎం.కృష్ణ, టిఎం.సత్య, పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ సూరం భాస్కర్‌ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, మైనార్టీ నాయకులు సౌదీ రావుఫ్‌ ఆధ్వర్యంలో రెండోరోజు దీక్ష శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. కౌతాళంలో చంద్రబాబు నాయుడుకు అక్రమంగా అరెస్టుకు నిరసన తెలుపుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఉల్లిగయ్య, టిడిపి రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు సురేష్‌ నాయుడు, టిడిపి కోసిగి మండల నాయకులు ముత్తిరెడ్డి, రామ్‌ రెడ్డి, హనుమంతు రెడ్డి, విజరు కుమార్‌ రెడ్డి, సొట్టయ్య, దేశాయి నరసింహ మూర్తి, నీలకంఠ రెడ్డి, దుర్గ మౌల, సుడికేరి ఈరన్న, చిన్న, రామలింగ, కాత్రికి చంద్ర, రంగస్వామి, రహిమాన్‌ పాల్గొన్నారు.