17 మిలియన్ల కస్టమర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్సైట్ డొమైన్ అది... ఇంటర్నెట్ వ్యాపారంలో అతిపెద్ద డొమైన్ హౌస్ట్ గోడాడీ. కామ్(GoDaddy.com)... ఈ డొమైన్ హ్యాక్ అయినట్లు తెలిసిన సమాచారం సంచలనంగా మారింది. ఈ హ్యాకింగ్ తో దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా లీకయ్యే ప్రమాదంలో పడిందని అంటున్నారు. యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. విషయం తెలుసుకున్న గోడాడీ వెంటనే ఐటీ ఫోరెన్సిక్స్ సంస్థ సహాయంతో విచారణ ప్రారంభించింది. గో డాడీ అనేది ఒక అమెరికన్ పబ్లిక్‌గా వ్యాపారం చేసే ఇంటర్నెట్ డొమైన్ రిజిస్ట్రార్ మరియు వెబ్ హౌస్టింగ్ కంపెనీ. వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడానికి ఇది వెబ్ హౌస్టింగ్ సేవకు ఉపయోగపడుతుంది. అయితే వర్డ్ ప్రెస్ హౌస్టింగ్ ఎన్విరాన్మెంట్కు అనధికారిక థర్డ్ పార్టీ యాక్సెస్ కనుగొన్నట్లు యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు వెల్లడించిన వివరాల్లో పేర్కొంది. పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వర్డ్ ప్రెస్ కోసం తమ లెగసీ కోడ్బెస్లో ప్రొవిజనింగ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసినట్లు తెలిపింది. అయితే గోడాడీ హ్యాక్ అయినట్లు వస్తున్న సమాచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ హ్యాక్ గత వారం నవంబర్ 17న జరిగినట్లు గుర్తించామని గో డాడీ తెలిపింది.










