ప్రజాశక్తి- కర్నూలు క్రైమ్ :లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ శాంతి కోసం సద్భావన కోసం నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కర్నూల్ నగరంలోని మౌర్యన్ వద్ద నుంచి రాజ్‌విహార్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీ లో డాక్టర్ కెవి. సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతో పాటు లయన్స్ క్లబ్ గవర్నర్ వై .నాగేశ్వర రావు యాదవ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజరు కుమార్ రాజు , డాక్టర్ కెవి. సుబ్బారెడ్డి , డాక్టర్ బాల మద్దయ్య , రామరాజు , రత్నప్రసాద్ ,పలువురు లయన్ లీడర్స్ పాల్గన్నారు.
పోస్టర్ పీస్ చైర్ పర్సన్‌గా కైప పద్మలత రెడ్డి
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పోస్టర్ పీస్ చైర్ పర్సన్‌గా మునిసిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మాలతారెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ఎంపికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.










