స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎర్రకోట
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రణాళికబద్ధమైన అభివృద్ధి వైసిపి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి తెలిపారు. పట్టణంలో వెంకటాపురం కాలనీ నుంచి మిలిటరీ కాలనీ మీదుగా కోసిగి రోడ్డు వరకు రోడ్డు వేసేందుకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. గత కొంత కాలంగా పెండింగ్ ఉన్న రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోడ్డు ఏర్పాటయితే పట్టణ ప్రజలకు రాకపోకలు సజావుగా సాగుతాయి. దీనికి సంబంధించిన రోడ్డు మ్యాప్, స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి టిపిఒ గోపాలకృష్ణ పాల్గొన్నారు.










