రోడ్లను పరిశీలిస్తున్న జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఎల్‌ఐసి కార్యాలయం రోడ్డు, లక్ష్మణ థియేటర్, మిలటరీ కాలనీ, సోగనూరు రోడ్డులో బిటి రోడ్లపై జీబ్రా లైన్స్ పనులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, నాయకులు బుట్టా రంగయ్య, మురారి, రాజశేఖర్ పాల్గొన్నారు.










