ఆటోకు అంటుకున్న మంటలు ఆర్పుతున్న దృశ్యం
లేపాక్షి : స్థానిక నవోదయ పాఠశాల వద్ద లేపాక్షి నుండి హిందూపురం వెళ్లే ప్రధాన రహదారిలో గుర్తు తెలియని గూడ్స్ ఆటో అగ్నికి అహుతి అయింది. స్థానిక ప్రజలు గమనించి మంటలను అర్పడానికి ప్రయత్నం చేశారు కానీ మంటలు అదుపులోకి రాలేదు. గూడ్స్ ఆటోకు మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియ రాలేదు.










