ప్రజాశక్తి - చింతలపూడి
ప్రకృతి వ్యవసాయంతోనే మానవులు ఆరోగ్యంగా జీవించగలరని చింతలపూడి ఎంపిడిఒ ఎం.మురళీ కృష్ణ తెలిపారు. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజింగ్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ ఎన్.రాంబాబు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం వలన ప్రాణాంతకమైన వ్యాధులతో మానవాళి ఇబ్బందులకు గురవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులను వాడితే వాటిని అధిగమించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి డిప్యూటీ తహశీల్దార్ పాతిమున్నిసా బేగం, ప్రకృతి వ్యవసాయ మండల ఇన్‌ఛార్జి జయరాజు, గుత్తి శ్రీనివాస వర్మ, పింగిలి నాగరాజు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.










