ప్రజాశక్తి-ఉయ్యూరు : ప్రజానాట్యమండలి కృష్ణాజిల్లా శిక్షణ శిబిరం ఉయ్యూరు నాగళ్ళ రాజేశ్వరమ్మ జానకి రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రారంభమ య్యాయి. ఈ శిక్షణా శిబిరంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి 50 మంది కళాకారులు రెండు రోజులు పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో నాటికలు డాన్సులు నేర్చుకుంటారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి అవలంబిస్తున్న మత రాజకీయాలను ప్రైవేటీకరణ తిప్పికొడుతూ అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజల మీద మోపుతున్నటువంటి భారాలు చెత్త పన్నులు అధిక ధరలు వీటన్నిటిపై ఈ రెండు రోజులు జరిగే శిక్షణా శిబిరంలో కళాకారుల శిక్షణ పొందుతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా శిబిరాలు జరుపుకొని రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరచడానికి సంఘటితపరచడానికి కళకళ కోసం కాదు ప్రజల కోసం ప్రగతి కోసం పని చేస్తున్న ప్రజానాట్యమండలి కృషి చేస్తుందన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి నాటి నుండి నేటి వరకు వెన్నుదన్నుగా నిలిచి ప్రజల్ని చైతన్య పరచడంలో పోరాటాలు కదిలించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చులేపుతు న్నటువంటి నేటి పాలకుల దుర్మా ర్గాలను ఎండగడుతూ ప్రజలంతా ఐక్యమత్యంతో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో అందరూ స్వేచ్ఛగా జీవించేలా ప్రభుత్వాలు చూడా లన్నారు. మణిపూర్ లో దాడులు గురవుతున్న ప్రజలకు ప్రభుత్వం ధైర్య నివ్వాలని వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదే సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కొండబాబు ఎస్కే కాసిం ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.
అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ ఆకస్మిక మతి దిగ్బ్రాం తి కలిగించిందని ఎస్ అనిల్ కుమార్, గాదే సుబ్బారెడ్డి ఎస్. కాసిం తమయ సంతాపాన్ని వ్యక్తం చేశారు.










