ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని వైసిపి మండలాధ్యక్షులు జి.భీమిరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని చెట్నిహల్లి గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. భీమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు 'సురక్ష'లో పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు నవరత్నాలతో సంక్షేమ పథకాలను అమలు తీరును గమనించాలని సూచించారు. నాడు-నేడు కింద పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టి కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. 'ఆరోగ్య సురక్ష' ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు నిర్వహించిన సీమంతంలో పాల్గొని ఆశీర్వదించారు. అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. సర్పంచి అంజినయ్య, ఎంపిటిసి రామాంజనేయులు, మాజీ సర్పంచి అల్లింగప్ప, ఎంపిడిఒ మణిమంజరి, ఇఒఆర్‌డి ప్రభావతి, అంగన్వాడీ సూపర్‌వైజర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఆస్పరి మండలంలోని హాలిగేర గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. సర్పంచి లింగమ్మ, స్పెషలిస్టులు గీతావాణి, గోపాలం ప్రణరు, డాక్టర్ రఘురామ్ రెడ్డి, దుర్గాబాయి, మంజుల, అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత, పంచాయతీ సెక్రటరీ చిన్న వెంకటేష్, టిడిపి మాజీ ఎంపిటిసి రామాంజినేయులు, వైసిపి నాయకులు నాయుడు పాల్గొన్నారు. హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఎంపిడిఒ సుహాసిని, తహశీల్దార్ హుస్సేన్ సాబ్, ఎంపిపి తనయుడు ఈసా, సర్పంచి తనయుడు చలవాది పంపాపతి, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్, డాక్టర్ న్యూటన్ పాల్గొన్నారు.
గర్భిణులను ఆశీర్వదిస్తున్న భీమిరెడ్డి










