Aug 05,2023 19:21

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - హోళగుంద
ప్రతి ఉద్యోగీ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని వైసిపి యువనేత ఎస్‌కె.గిరి తెలిపారు. శనివారం మండలంలోని ఎల్లార్తి గ్రామ సచివాలయంలో సర్పంచి కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పెండింగ్‌ పెట్టుకూడదని తెలిపారు. సచివాలయానికి వచ్చిన ప్రజలను ప్రేమగా పలకరించాలని, విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అన్ని పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి షాపి, విఆర్‌ఒ ప్రహ్లాద, ఎంఎల్‌హెచ్‌పి నిరాజ్‌, అంగన్వాడీ టీచర్‌ ఇందిర, విశాలాక్షి, ఎఒఎ శేషాద్రి పాల్గొన్నారు.