Jul 20,2023 20:43

ధ్రువపత్రాలను అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి 'జగనన్న సురక్ష' అండగా నిలిచిందని వైసిపి మండల మాజీ కన్వీనర్‌ రామాంజినేయులు తెలిపారు. గురువారం మండలంలోని చిగిలి, ముత్తుకూరు సర్పంచులు జయమ్మ, తోజయప్ప, ఎంపిడిఒ రాణెమ్మ, తహశీల్దార్‌ కుమారస్వామి ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడారు. 'జగనన్న సురక్ష' పేదలకు వరం లాంటిదని తెలిపారు. ఇప్పటి వరకు చిగిలి గ్రామంలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు మొత్తం 215 మందికి, ముత్తుకూరులో 371 మందికి పంపిణీ చేశామన్నారు. ఇఒఆర్‌డి నరసింహా రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌ గాయత్రి, ఎంపిటిసి రాధాకృష్ణ, విఆర్‌ఒలు గోవిందు, హరి నాయక్‌, పంచాయతీ కార్యదర్శులు వీరేష్‌, జంప్ల నాయక్‌, నాయకులు ప్రకాష్‌, వేణుగోపాల్‌, చంద్ర పాల్గొన్నారు.